సిద్దిపేట పట్టణంలోని కోమటిచెరువును సందర్శించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, టూరిజం అండ్ కల్చర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ సుల్తానియా. ఈ సందర్భంగా కోమటి చెరువులో లేజర్ షో, రూబీ నెక్లెస్, సిద్దిపేట నైట్ గార్డెన్ ను పరిశీలించారు. సస్పెన్షన్ బ్రిడ్జిపై నడిచి కోమటి చెరువు అందాలకు ముగ్ధుడైన ఆయన సిద్దిపేట పట్టణంలో గల ఈ కోమటి చెరువు అందాలు జాతీయస్థాయిలో సిద్దిపేటకు ప్రత్యేకతను తీసుకువస్తున్నాయని కొనియాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మరియు టూరిజంశాఖ అధికారి మనోహర్ కోమటి చెరువును ఏ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సహకారంతో రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మాత్యులు హరీష్ రావు నేతృత్వంలో దేశంలోనే అద్భుతమైన పర్యాటక కేంద్రంగా ఎలా రూపొందించింది వివరించారు. అదేవిధంగా భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలను మ్యాప్ ద్వారా వివరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కడవెర్లు రాజనర్సు, డిఆర్డిఓ గోపాలరావు, మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.