విద్య

*రాచర్ల బొప్పపుర్ జెడ్పీహెచ్ యస్ స్కూల్ లోఘనంగా బాలల దినోత్సవం*

107 Views

*మాజీ ప్రధాని నెహ్రూకు ఘన నివాళి*
▪️ *విద్యార్థులే ఒక్కరోజు ఉపాధ్యాయులుగా*
▪️ *విజేతలకు బహుమతులు ప్రదానం*
నేటి పిల్లలే రేపటి నవ భారత నిర్మాతలు, వారి బంగారు భవిష్యత్తు కోసం మనమంతా కలిసి పనిచేద్దాం.. బాలల శ్రేయస్సే లక్ష్యంగా దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుదాం అంటూ పలువురు పేర్కొన్నారు. బాలల దినోత్సవ వేడుకలను శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా లోని ఎల్లారెడ్డి పేట మండలం రాచర్ల బొప్పపుర్ జెడ్పీ హెచ్ యస్ పాఠశాల లో దేశ మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థులకు దేశభక్తి గీతాలు, ఉపన్యాస, వ్యాసరచన, చిత్రలేఖనం, పరుగు పందెం, నృత్య, తాడులాగు పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు, పుస్తకాలు అందజేశారు. భారతదేశ తొలి ప్రధానిగా నెహ్రూ చేసిన సేవలను గుర్తు చేశారు.  చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేశారు.ఈరోజు ప్రధానోపాధ్యాయురాలుగా పొన్నాల తన్విక,
డీఈవోగా ఎస్ విశ్వం చారి
ఈ కార్యక్రమంలో పాఠశాల
ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు వెంకటరమణ , కిస్టారెడ్డి , మాలతి, శైలజ, రేవతి, బాల్ రెడ్డి ,శ్రీనివాస శర్మ ,రమ మనోహర్, బాలయ్య ,హజు నాయక్ ,రమేష్ రెడ్డి భరత్, ప్రభాకర్ ,శ్రీకాంత్ మరియు రామ్ రెడ్డి  విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7