Breaking News

దమ్మన్నపేట్ లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జీవిత గమనం మారుతుంది

145 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట్ గ్రామం లో ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో శుక్రవారం జన విజ్ఞాన వేదిక మరియు సమగ్ర శిక్షఆధ్వర్యంలో ప్రతి ఏట చెకుముకి సైన్స్ సంబరాలను నిర్వహించడం జరుగుతుంది. కరోనా వలన గత రెండు సంవత్సరాలు ఆన్లైన్లో నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం నుంచి మరల చెకుముకి టాలెంట్ పరీక్షలను 8,9, 10తరగతి విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యక్షంగా పాఠశాల, మండల,జిల్లా ,రాష్ట్ర స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా శుక్రవారం పాఠశాల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ ప్రశ్న పత్రాలను గంభీరావుపేట మండల ఇంచార్జ్ పాశం భాస్కర్ అందజేయడంజరిగింది అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ బోయన్న గారి నారాయణ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ33 సంవత్సరాల నుండి వివిధ మూఢనమ్మకాల ద్వారా ప్రజల్లో నెలకొన్న అనిచ్చితిని జాడ్యానీ తొలగించి ప్రజలను సైన్స్ పట్ల అవగాహన కలిగించి వారి జీవన నైపుణ్యాలను పెంచడంలో వారి కృషి ఎంతో ఉందని అభినందించారు.అదేవిధంగా పాఠశాల స్థాయిలోని శాస్త్రీయ వైఖరిని అభివృద్ధి పరచడంలో మరియు వారు నిజజీవితంలో ఒక హేతుబద్ధమైన ఆలోచన తోజీవించుట కు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు దమ్మన్నపేట్ గ్రామం లో ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి 8 వ తరగతి నుండి డి మనోహర్ , 9 వ తరగతి నుండి ఎస్ ప్రశాంత్, 10 వ తరగతి నుండి ఎస్ అస్విత, ఎంపికయ్యారు అని ప్రధానోపాధ్యాయులు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found