(తిమ్మాపూర్, సెప్టెంబర్ 24)
కరీంనగర్ పట్టణంలోని గంజ్ హైస్కూల్లో 1973 వ సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న పూర్వంవిద్యార్థులు తిమ్మాపూర్ మండలంలోని వాగేశ్వరీ ఇంజినీరింగ్ కళాశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా జరుపుకున్నారు.
చిన్ననాటి స్మృతులను నెమరేసుకున్నారు. చిన్నపిల్లలుగా వెళ్లిన వారు.. మనవళ్లు, మనమరాళ్లను ఎత్తుకుని రావడం ఒకరినొకరు గుర్తుపట్టకపోవడం కనిపించింది. మళ్లీ నూతనంగా పరిచయం చేసుకున్నారు. చాలామంది పూర్వ విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలు చేసి రిటైర్మెంట్ అయ్యారు. కుటుంబసభ్యులతో రోజంతా ఆటాపాటలతో ఆనందంగా గడిపారు. గంజ్ పాఠశాల అభివృద్ధికి తామంతా కృషి చేస్తామని చెప్పారు. యాభై ఏండ్ల తర్వాత కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని పూర్వ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. మరణించిన తోటి స్నేహితులు, ఆనాటి ఉపాధ్యాయులకు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం ఉపాధ్యాయులకు సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకట్రెడ్డి, సత్యనారాయణ, రాజేశం, రవూఫ్, పూర్వ విద్యార్థులు విశ్వనాథ్ బాలకిషన్, చంద్రమౌళి, సత్యం, గౌరిశెట్టి రాజేందర్, ప్రభాకర్, సోమనాథ్, లక్ష్మారెడ్డి, అంజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.