ప్రాంతీయం

ప్రాథమిక పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం

71 Views

చేబర్తి ప్రాథమిక పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం

సారథి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలకలు పంపిణీ

సిద్దిపేట జిల్లా జూన్ 15

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో శనివారం ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు నర్సింలు ఆధ్వర్యంలో చిన్నారి విద్యార్థిని విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు,ఈ కార్యక్రమంలో పాల్గొన్న సారథి ఫౌండేషన్ చైర్మన్ గుడాల శేఖర్ గుప్తా ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు పలకలు, బలుపాలు,బిస్కెట్స్ అందజేశారు,ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్సింలు, గ్రామ తాజా మాజీ సర్పంచ్ అశోక్, తాజా మాజీ ఉప సర్పంచ్ స్వామి మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలలో చేరిన చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించడం జరిగిందని ప్రతి సంవత్సరం విద్యార్థిని విద్యార్థులకు సారథి ఫౌండేషన్ చైర్మన్ గుడాల శేఖర్ గుప్తా ఆధ్వర్యంలో చిన్నారులకు పలుకులు అందజేస్తారని,అలాగే.

ఈ సంవత్సరం కూడా విద్యార్థిని విద్యార్థులకు పలకలు అందజేయడం జరిగిందని కి అభినందనలు తెలిపారు అనంతరం గుడాల శేఖర్ గుప్తా మాట్లాడుతూ నేటి బాల బాలికలే రేపటి భావి భారత పౌరులు అని చిన్ననాటి నుంచే విద్యార్థిని విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు,అలాగే ప్రతి ఒక్కరూ సేవా నిరతి కలిగి ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి సిద్దేశ్వర్,జర్నలిస్ట్ జాలని యాదగిరి,చిన్ని కృష్ణ,అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ అఖిల,ఉపాధ్యాయురాలు నాగలక్ష్మి, సుదీష్ణ,స్వాతి,జ్యోతి, అంగన్వాడి టీచర్లు రాణి,స్వప్న, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్