ముస్తాబాద్, మార్చి18 (24/7న్యూస్ ప్రతినిధి) ముస్తాబాద్ మండల కేంద్రంలోని కొత్తబస్టాండ్ వద్ద చెట్లునేలకొరిగి రేకులతో తయారు చేసిన చిరువ్యాపారి డబ్బాపై పడడంతో పక్కనున్న ముస్తాబాద్ గ్రామవాసి ప్రమాదంలో చిక్కుకొని అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. అదేవిధంగా డబ్బా నిర్వాహకుడికి గాయాలు కాగా విద్యుత్ స్తంభాలు విరిగి రోడ్డున పడడంతో పాటు బస్టాండ్ సమీపంతా విద్యుత్ తీగలు అల్లుకున్నాయి. దీంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. సోమవారం సుమారు సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలులతో పాటు వడగళ్ల వర్ష ప్రభావంతో ఈ సంఘటన చోటు చేసుకుంది.
