ప్రాంతీయం

కలెక్టరేట్ లో ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు.

104 Views

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్

ఈ సందర్భంగా
జడ్పీ చైర్ పర్సన్ గారు మాట్లాడుతూ
కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ గర్వించదగిన గొప్ప వ్యక్తి అన్నారు. జీవితాంతం బాపూజీ బడుగు, బలహీన వర్గాల కోసం పోరాడాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుడిగా, ప్రజాస్వామికావాదిగా, అణగారిన వర్గాల నాయకుడిగా, నిబద్దతతో కూడిన రాజకీయ నాయకుడిగా కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం భవిష్యత్ తరాలకు నిదర్శనం అన్నారు. బాపూజీ జీవితాంతం అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు, సహకార రంగాల ప్రతిష్టతకు కృషి చేశారన్నారు. సమాజంలోని అన్ని వర్గాలను ఏకతాటిపైకి తీసుకురావడమే కాకుండా తెలంగాణ కోసం తన మంత్రి పదవికి రాజీనామా చేసిన బాపూజీ గత తెలంగాణ ఉద్యమంలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారన్నారు. హైదరాబాదులో అఖిల భారత పద్మశాలి సంఘం ఏర్పాటు లో కీలక పాత్ర పోషించారన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి, వర్ధంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆయన గౌరవార్థం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. రాష్ట్ర హార్టికల్చర్ యూనివర్సిటీకి బాపూజీ పేరు పెట్టడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభావంతులైన చేనేత కార్మికులకు ఆయన పేరు మీద అవార్డులు అందజేస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తూ కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను నెరవేరుస్తుందన్నారు.

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ…. స్వాతంత్య్ర సమరయోధుడుగా, తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముఖ్య పాత్ర పోషించారని అన్నారు. వారి సేవలను స్మరించుకుంటూ జయంతి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7