సిద్దిపేట జిల్లా అక్టోబర్ 21
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
గజ్వేల్ లో మార్కెట్లో శనివారం పువ్వుల కొనుగోలు తో సందడి నెలకొంది .సద్దుల బతుకమ్మ కోసం వివిధ రకాల పూలను ప్రజలు కొనుగోలు చేశారు.గానుగ, బంతి,చామంతి పూలను పల్లెటూరు నుంచి రైతులు తీసుకువచ్చి అమ్ముతున్నారు.ఇందిరా పార్క్ చౌరస్తా దారి పొడవునా పూలతో నిండి ఉండటంతో చూపరులకు కనువిందు చేసింది.
