24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
మార్కుక్ జూన్ 11.
ప్రస్తుతం పెరుగుతున్న కూలీల సమస్య దృశ్య ప్రతి పంటను విత్తనం రైతులకు చాలా భారంగా మారింది కావున రైతులు పత్తి విత్తనాన్ని న్యూమాటిక్ ప్లాంటర్ సహాయంతో అధిక సాంద్రత పద్ధతిలో ప్రత్తి విత్తుకోవాలని ఏరువాక శాస్త్రవేత్తలు విజయ్ మరియు డాక్టర్ పల్లవి రైతులకు సూచించారు. ఈ పద్ధతిలో వేసుకోవడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణం విత్తుకోవచ్చని మొలక శాతం కూడా పెరుగుతుందనిమరియు విత్తేటప్పుడు ఎరువులు కూడా వేసుకోవచ్చని తెలియజేశారు.మండల వ్యవసాయ అధికారి టి. నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ
ఈ పద్ధతిలోని వంగడాలు పంట కాలం తక్కువగా ఉండటం వల్ల కాయలు మరియు పూత తొందరగా మరియు 20 నుండి 30 వరకు వస్తున్నాయి. మొక్కలు ఏపుగా పెరగకుండా మేపిక్వాట్ క్లోరైడ్ అనే మందును పిచికారీ చేసుకోవాలని సూచించారు. ఎకరాకు 25-30 కేజీ ల యూరియా 15 కిలోల పోటాష్ ఎరువులను వేసుకోవాలని సూచించారు.
సాధారణంగా హైబ్రిడ్ వంగడాలను రైతులు ఎకరానికి 4938 మొక్కల నుండి 7407 మొక్కల సంఖ్య ఉండటం వలన మొక్కలు బాగా పెరగడం, పంటకాలం పెరగడం, తద్వారా గులాబి రంగు పురుగు ఉధృతి ఎక్కువ కావడం వలన ఆశించిన మేరకు రావడం లేదు.
ఈ కార్యక్రమంలో రాశి కంపెనీ ప్రతినిధులు మనోజ్
వ్యవసాయ విస్తరణ అధికారి విష్ణు వర్ధన్, రైతు నాగి రెడ్డి,
రైతులు పాల్గొన్నారు.
