మంచిర్యాల పట్టణంలో నిర్వహించిన పార్లమెంటరీ స్థాయి సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చెప్పు చూపుతో చెప్పుతో కొడతా అని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ గౌరవ మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మరియు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు మంచిర్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంచిర్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళ అధ్యక్షురాలు పెంట రజిత, పట్టణ మహిళా అధ్యక్షురాలు గజ్జల హేమలత, పట్టణమైనార్టీ అధ్యక్షులు నజీర్, యూత్ కాంగ్రెస్ నాయికిని సురేందర్, NSUI పట్టణ అధ్యక్షులు వెంకట సాయి, కాంగ్రెస్ నాయకులు కలువల జగన్ శ్రీనివాస్ గౌడ్,బోల్లం భీమన్న ,కంకణాలు శ్యామ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






