రాజకీయం

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ నిరుపేదలకు ఓ వరం

219 Views

-మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్

(మానకొండూర్ సెప్టెంబర్ 16)

తెలంగాణలోని నిరుపేదలకు కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ ఒక వరం లాంటివని మానకొండూర్ ఎమ్మెల్యే డా.రసమయి బాలకిషన్ అన్నారు. శనివారం మానకొండూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, సీఎం రిలీఫ్ పండ్, చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హాజరై లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…

తెలంగాణ రాకముందు ఆడబిడ్డ పుట్టిందంటే నెత్తిమీద కుంపటిగా తల్లిదండ్రులు భావించేవారని, తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పట్ల ఆడబిడ్డ పుడితే అదృష్ట లక్ష్మిగా భావిస్తున్నారన్నారన్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాడన్నాడు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాడని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మానకొండూరు జడ్పిటిసి తాళ్లపల్లి శేఖర్ గౌడ్, ఎంపీపీ ముద్ధసాని సులోచన- శ్రీనివాస్ రెడ్డి, పలు గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *