విద్య

ములుగు ఫారెస్ట్ రీసెర్చ్ కళాశాలలో జరిగిన ఉద్యానవన మూడవ స్నాతకోత్సవ కార్యక్రమం

53 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
జూన్ 11 మర్కుక్ (సిద్దిపేట జిల్లా)

15 సంవత్సరాల క్రితం మన దేశం లో వనరులు చాలా పరిమితంగా ఉండేవని , ఇప్పుడు మనం ప్రపంచం లోనే 5 వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నామనీ, ఇది మన విద్యావ్యవస్థ ద్వారా మాత్రమే సాధ్యమైందనీ తెలంగాణ ,ఝార్ఖండ్ , పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నర్ సీపీ.రాధాకృష్ణన్ అన్నారు.సిద్దిపేట జిల్లా ములుగు ఫారెస్ట్ రీసెర్చ్ కళాశాలలో జరిగిన ఉద్యానవన మూడవ స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గవర్నర్ సిపి.రాధాకృష్ణన్, తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్. చాన్సలర్.గీతాలక్ష్మి లు పాల్గొని 285 మంది విద్యార్ధిని ,విద్యార్థులకు పట్ట సర్టిఫికెట్ లు అందించారు.ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ 15 యేండ్ల లో దేశం లో విద్య వ్యవస్థ చాలా మెరుగు పడిందనీ, ఇండియన్ ఎకానామీ మొదటి స్థానం లో రావడానికి యువత కృషి ఎంతో అవసరమని నరేంద్ర మోడీ అంటారని గుర్తు చేశారు.విద్యార్థులు చిన్న చిన్న విజయాలు సాధించి ఆనందించాలనీ ,ఇండియన్ జిడిపి పెరుగుదల లో 47 % అగ్రికల్చర్ ICIR లు దోహదపడుతున్నాయనీ అన్నారు.ఇప్పుడు మనమందరం నాలెడ్జ్ ఓరియెంటెడ్ ఐనం అని చిన్న చిన్న సక్సెస్ లను ఎంజాయ్ చేస్తే నే జీవితం లో పెద్ద పెద్ద విజయాలను సాధించగలమని అన్నారు.నేను అబ్రహం లింకన్ , నరేంద్ర మోడీ ఇద్దరినీ ఇన్స్పిరేషన్ గా తీసుకుంటా అని , అబ్రహం లింకన్ , నరేంద్ర మోడీ ఇద్దరు దేశ ప్రజల శ్రేయస్సు కోసం కృషి చేసే వ్యక్తులనీ అన్నారు.చిన్న స్థాయి నుండి నరేంద్ర మోడీ ప్రపంచం లోనే విలువైన నాయకుడిగా ఎదిగారనీ,దేశ వ్యవసాయ విధానాన్ని మెరుగుపరచడానికి మోడీ ప్రభుత్వం కృషి చేస్తుందనీ అన్నారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్