విద్య

చేబర్తి గ్రామంలో బడిబాట కార్యక్రమం

55 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
మర్కుక్ జూన్ 11.

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఉన్నత పాఠశాల యొక్క ఆవరణంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది .ఇట్టి కార్యక్రమానికి మర్కుక్ మండల తహసీల్దార్,చేబర్తి స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడుతూ విద్యార్థుల విద్యా అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టి అనేక సౌకర్యాలను కలిగిస్తుంది అని అన్నారు.కాబట్టి గ్రామంలో ఉన్న బడి ఈడు పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలోనె చదువుకునేందుకు తల్లిదండ్రులను కృషి చేయాలని కోరారు.ఇందుకు గ్రామస్తులు,గ్రామ పెద్దలు సహకరించాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల హెచ్ఎం శ్రీ శంకర్ రెడ్డి, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం కే. నర్సింహులు, గ్రామ తాజా మాజీ సర్పంచ్ అశోక్, తాజా మాజీ ఉప సర్పంచ్ స్వామి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్లు సౌందర్య,అఖిల,గ్రామ సీఏలు గ్రామ పెద్దలు మహిళా సంఘాల సభ్యులు పంచాయతీ సెక్రెటరీ సిద్దేశ్వర, యువకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్