ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ స్కూల్ హై స్కూల్ లో పదో తరగతి పరీక్షల్లో పదికి పది సాధించి పేరు తెచ్చిన రిశ్వంత్. మండల కేంద్రానికి చెందిన చింత రాజు స్రవంతి వ్యాపారి దంపతుల ఏకైక కుమారుడు రిశ్వంత్ (15) అనే విద్యార్థి స్థానిక విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో విద్యను అభ్యసిస్తున్నాడు. నిన్నటి రోజు వెలువడిన 10వ తరగతి పరీక్షల్లో 10 జి పి ఏ కు 10 జీపీఏ సాధించి తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల కలలను నెరవేర్చాడు.ఇతనితోపాటు రేశ్మిత, సాహితీ, షేక్ అలియా షహరీన్ ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఎండి లతీఫ్ మాట్లాడుతూ… విద్యార్థి ప్రతిరోజు పాఠశాలకు సరైన సమయంలో విచ్చేసి విద్యార్థితో పాటు తోటి విద్యార్థులను విద్య పట్ల ఎంతో శ్రద్ధతో మంచి గుణగణాలతో విద్య పట్ల సలహాలు సూచనలు ఇస్తూ హైస్కూల్లో ఎలాంటి కార్యక్రమాలు ఉన్న తన వంతు సహాయంతో పాఠశాల పట్ల విద్యార్థుల పట్ల గౌరవంతో ఎన్నో కార్యక్రమాలలో సందేశాలిస్తూ ప్రతి కార్యక్రమాన్ని జిల్లా స్థాయికి తీసుకెళ్లాడని వారు గౌరవిస్తూ అభినందించారు. వీరితో పాటు స్థానిక వాణిజ్య వ్యాపారులు ప్రజా ప్రతినిధులు రిశ్వంత్ ను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
