కొమరవెళ్ళి శంకరయ్య కు ఘన సన్మానం
సిద్దిపేట్ జిల్లా జూన్ 10
సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో సోమవారం నాచారం దేవస్థానం శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి నిత్యాన్న దాన సత్రం,వృద్ధాశ్రమం చైర్మన్ గా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన కొమరవెళ్ళి శంకరయ్య ను రేణుకా ఎల్లమ్మ దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు అనంతరం వంగపల్లి అంజయ్య స్వామి మాట్లాడుతూ కొమరవెళ్ళి శంకరయ్య శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి నిత్యాన్నదాన సత్రం చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా చిరు సన్మానం చేయడం జరిగిందని అన్నారు అనంతరం కొమరవెళ్ళి శంకరయ్య మాట్లాడుతూ నా మీద నమ్మకంతో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి సత్రం చైర్మన్ గా పదవి రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సత్రం అభివృద్ధికి అందరితో కలిసి నా వంతు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు కైలాస ప్రశాంత్,ఉమేష్,ఉప్పల చంద్ర శేఖర్, అత్తెల్లి ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు
