శ్రీ పార్థీశ్వర స్వామి ఆలయంలో మాజీ వైస్ ఎంపీపీ తలారి నర్సింలు పూజలు
108 కొబ్బరి కాయలు కొట్టిన మాజీ వైస్ ఎంపీపీ తలారి నర్సింలు
రఘునందన్ రావు ఎంపీ గా గెలిచిన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు
ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయడం హర్షణీయం
సిద్దిపేట జిల్లా జూన్ 10
సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ లోని పురాతన దేవాలయం శ్రీ పార్థీశ్వర ఆలయంలో బీజేపీ సీనియర్ నాయకుడు ఉమ్మడి దౌల్తాబాద్ మాజీ వైస్ ఎంపీపీ తలారి నర్సింలు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 108 కొబ్బరి కాయలు కొట్టి మొక్కు తీర్చుకున్న తలారి నర్సింలు మాట్లాడుతూ మెదక్ ఎంపీ గా రఘునందన్ రావు విజయం సాధించడం కేంద్రం లో మళ్ళీ మోడీ ప్రధాన మంత్రిగా చూడాలని ముక్కిన మొక్కులు చెల్లించడం జరిగిందని అన్నారు నరేంద్ర మోడీ సారథ్యంలో భారత దేశం మరింత బలపడుతుందని అన్నారు
