వ్యవసాయం

సొసైటీ భవనానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

54 Views

(మానకొండూర్ జూన్ 10)

కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం గట్టుదుద్దెనపల్లి గ్రామంలోని విశాల సహకార పరపతి సంఘానికి సంబంధించి నూతన కార్యాలయ భవనం, విక్రయశాల, గోదాముల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని సొసైటీ సిబ్బంది సోమవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్యఅతిథిగా హాజరై భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే కవ్వంపల్లితో పాటు ముఖ్య అతిథిగా హాజరవ్వాల్సిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అనివార్య కారణాల వల్ల రాలేకపోవడంతో ఫోన్ ద్వారా మాట్లాడారు..

కరీంనగర్ సింగిల్ విండో అధ్యక్షుడిగా తన రాజకీయ ప్రస్తానం మొదలైందని,మార్క్ ఫెడ్ చైర్మన్ గా ఉన్న సందర్భంలో దుద్దెనపల్లి సొసైటీకి అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించానని, ప్రస్తుతం క్రిబ్కో డైరెక్టర్ గా ఉన్నానని భవిష్యత్తులో సంఘం ద్వారా సహకారాలు అందించి రైతులకు అండగా ఉంటానని,దుద్దెనపల్లి సొసైటీ జిల్లాలోనే రైతాంగానికి అండగా ఉండి పెద్దదిక్కుగా నిలిచిందని అభినందించారు.

ఈ సందర్భంగా అందరి తరుపున ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం ఎమ్మెల్యే కవ్వంపల్లి మాట్లాడుతూ..

జాతీయ రహదారి విస్తరణ పనులలో భాగంగా సహకార సంఘానికి సంబంధించి భవనాల స్థలం పోతుండడంతో ప్రభుత్వం ద్వారా సంఘానికి రావాల్సిన ధర రాలేదని సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో స్పందించి జిల్లా కలెక్టర్ తో చర్చలు జరిపి స్థలానికి ఎక్కువ డబ్బులు వచ్చే విధంగా కృషి చేస్తానని అన్నారు. దుద్దెనపల్లి సహకార సంఘం జిల్లాలోనే పేరొందిన సహకార సంఘం అని ఈ సంఘం దినదిన అభివృద్ధి చెందాలని కోరారు. దేశంలో రైతులు వర్షాలతో వడ్లు తడిసి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని విదేశాలలోని వ్యవసాయంలో ఇటువంటి ఇబ్బందులు ఉండవని ప్రత్యేక అధికారులతో విదేశాలలోని పంటల పై పరిశోధన జరిపి అక్కడ వాడే పద్ధతులను ఇక్కడ కూడా వాడే విధంగా ప్రభుత్వం తరఫున రైతులకు సహయం అందించే విధంగా కృషి చేస్తానని, పంట అధిక దిగుబడి అయ్యే గ్రామాలలో ఒక మాడల్ ఐకేపీని ఏర్పాటు చేసి రైతులకు అన్ని విధాల ఉపయోగపడే విధంగా ప్రణాళికలను తాను సిద్ధం చేశానని అన్నారు.

ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు అనభేరి రాదాకిషన్ రావు, ఉపాధ్యక్షుడు కర్క అనంతరెడ్డి, సభ్యులు కనకం సుజాత, మ్యాదరి మల్లేశం ,అవుదరి విజయ పెంచాల రాజయ్య, చిరుతల యాదగిరి, కర్క చంద్రశేఖర్ రెడ్డి, గుంటి మల్లేశం,పాశం సమ్మయ్య, చెన్నాడి నరసింహ రెడ్డి, అన్నాడి జలపతి రెడ్డి, కార్యదర్శి గుండా రామయ్య కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మండల నాయకులు రైతులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కొమ్మెర రాజు తిమ్మాపూర్