ప్రాంతీయం

ఉద్యోగులను చర్చకు పిలువకపోతే కలెక్టరేట్ ముట్టడిస్తాం – బిజెపి

54 Views

మంచిర్యాల జిల్లా.

సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులను చర్చలకు పిలువకపోతే బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్లను ముట్టడిస్తాం – బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్.

మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు గత 20 రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మెకు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి  ఉద్యోగులకు సంఘీభావం తెలుపడం జరిగింది. 20 రోజులుగా ఎస్ ఎస్ ఏ ఉద్యుగులు సమ్మె చేస్తున్న ప్రభుత్వం కనీసం చర్చలకు పిలవకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ పాలనకు నిదర్శనం అదే విధంగా జిల్లాలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు ఎందుకు ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం లేదని రఘునాథ్ ప్రశ్నించారు. ఉద్యోగులను రెండు రోజుల్లో చర్చలకు పిలువకపోతే బీజేపీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కలెక్టరేట్లను ముట్టడిస్తాం అని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఎనగందుల కృష్ణ మూర్తి, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, సత్రం రమేష్, బేతు రవి, గడ్డం స్వామి రెడ్డి, కిషోర్, వంశీ, మనీష్ మరియు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్