నీట్ పరీక్ష పై విచారణ జరిపించాలి
కర్రోల్ల రవిబాబు రాష్ట్ర కార్యదర్శి ధర్మ సమాజ్ పార్టీ
సిద్దిపేట జిల్లా జూన్ 9
సిద్దిపేట్ జిల్లా దుబ్బాక జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ 2024 లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి బాధ్యత వహించాలనీ నీట్ 2024 ని రద్దుచేసి తిరిగి మళ్ళీ పరీక్ష నిర్వహించాలని ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రోల్ల రవిబాబు డిమాండ్ చేశారు.
దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ ప్రాంతీయ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జాతీయస్థాయిలో వైద్య విద్య ప్రవేశాల ఎంపిక కొరకు నీట్ పరీక్ష లో అవకతవకలు జర జరగడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిగ్గుపడాలని పూర్తి బాధ్యత వహించి కేంద్ర ప్రభుత్వం బాధ్యులు రాజీనామా చేయాలని ప్రతిభ కలిగిన లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటమేననీ ఇప్పటికైనా ఈ జరిగిన నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేసి మళ్లీ పరీక్షను నిర్వహించాలని అర్హులైన ప్రతిభ గలిగిన విద్యార్థులకి న్యాయం జరగాలంటే మళ్ళీ పరీక్షను నిర్వహించాలని అవకతవకలకి పాల్పడిన కారకులని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, డి.బి. రాజ్, ప్రసన్న, పరమేశ్వరి, దుబ్బాక మండల అధ్యక్షులు అనిల్, అక్బర్ పేట భూంపల్లి మండల అధ్యక్షులు మల్లేశం మిరుదొడ్డి మండల అధ్యక్షులు దీపక్, రాజు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
