అక్షర యోధుడు రామోజీరావు చిత్రాన్ని సబ్బుబిళ్ళ మీద అద్భుతంగా చిత్రించి ఘన నివాళులు అర్పించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, రాష్ట్రస్థాయి కళారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. ఈ సందర్బంగా మాట్లాడుతూ క్రింది స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు ఎదిగి, అక్షరాన్ని ఆయుధంగా మలిచి, సమాజ శ్రేయస్సుకు నిరంతరం పరితపించిన మహా వ్యక్తి రామోజీరావు అన్నారు. ప్రజల పక్షాన నిలిచి సేవే లక్ష్యంగా ఆపన్న హస్తం కోసం ఎదురుచూసిన వారికి అండగా నిలిచాడన్నాడు. ప్రతి రంగంలో తనదైన ముద్ర వేసిన గొప్పవ్యక్తి రామోజీరావు అన్నారు.




