ప్రాంతీయం

అధ్యక్షుల సహాయంతో కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన ఎల్ ఓసి…

93 Views

ముస్తాబాద్, ఆగస్టు 23 (24/7న్యూస్ ప్రతినిధి): మండల కేంద్రంలోని మద్దికుంట గ్రామానికి చెందిన సుంచురాజు కిడ్నీలకు సంబంధించిన వ్యాధి బారిన పడి హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఆకుటుంబ సభ్యులు ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డిని కలిసినారు వాళ్ళ సమస్యను గమనించి వారి దీన పరిస్థితిని చూసి ఈ సమస్యను సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వద్దకు సమస్యను వివరించి ప్రభుత్వం నుండి ఎల్ఓసి 2,50,000/రూ. ఇప్పించారు. ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ అందునా మండల అధ్యక్షులు స్వయంగా నాడు ఎలక్షన్లకు ముందు మాట్లాడిన ప్రతి ప్రకటన అమలు చేయటంతో ప్రజల్లో నమ్మకం ఏర్పడుతందని విశ్వసిస్తన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి వెన్నంటూ నేనుంటానని బాహటంగా తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులు ఆపదలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుందని హర్షిస్తూ ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డికి, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7