ప్రాంతీయం

స్మశాన వాటిక కబ్జా

60 Views

స్మశాన వాటిక కబ్జా చేసిన వారిపై చర్య తీసుకోవాలి

కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మరాటి కృష్ణమూర్తి

సిద్దిపేట జిల్లా మే 29

జగదేవపూర్ మండలంలోని మునిగడప గ్రామంలో స్మశాన వాటిక, డంపింగ్ యార్డ్ కబ్జా చేసిన గొల్లపల్లి గ్రామానికి చెందిన వంటేరు వెంకట్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని కేవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మరాటి కృష్ణమూర్తి అన్నారు. దాదాపు పది సంవత్సరాల క్రితం స్మశాన వాటిక, డంపింగ్ యార్డ్ మునిగడప రెవిన్యూ పరిధిలో నిర్మించారు. గొల్లపల్లి గ్రామానికి చెందిన వంటేరు వెంకట్ రెడ్డి స్మశాన వాటిక ప్రక్కన ల్యాండ్ కొనుగోలు చేసి దానితోపాటు స్మశాన వాటిక స్థలాన్ని డంపింగ్ యార్డ్ స్థలాన్ని కబ్జా చేసి మునిగడప రెవెన్యూ పరిధిలో ఉన్న భూమిని గొల్లపల్లి గ్రామానికి చెందిన వెంకట రెడ్డి ఆక్రమించారు. అతనిపై చర్యలు తీసుకోవాలని జగదేవపూర్ మండల తహసిల్దార్ కు వినతిపత్రం ఇచ్చారు. తహసిల్దార్ మాట్లాడుతూ స్మశాన వాటిక కబ్జా చేసిన భూమిని ఎంక్వయిరీ చేసి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ నాయకులు కురాడపు దాసు, కురాడపు బాలింగం, క్షీల సాగర్ దశరథ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్