కరెంట్ షార్ట్ తో 1,20,000 వేల విలువగల గేదె మృతి
కళ్ళ ముందే గేదె మరణించడంతో యజమానుల రోదనలు మిన్నంటాయి
ప్రభుత్వం ఆదుకోవాలంటూ రైతు ఆవేదన
సిద్దిపేట జిల్లా మే 29
కరెంట్ షాక్ తో 1,20,000 వేల విలువ గల గేదె మృతి చెందిన సంఘటన మర్కుక్ మండలం శివార్ వెంకటాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఉదయం రైతు కొరివి మాదారి పొలం వద్ద కు రోజువారీగా గేదెను పొలాల్లోకి తోలుకొని వెళ్లారు. గేదె మేత మేస్తున్న క్రమంలో అనుకోకుండా పక్కనే ఉన్న స్థంభం యొక్క సపోర్టు వైరుకు గేదె తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. స్తంభం యొక్క సపోర్టు వైరుకు క్యాసారం లేనందున గేదె విద్యుత్ ఘాతానికి గురైనట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం విద్యుత్ సిబ్బందికి మరియు స్థానిక పోలీస్ వారికి సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకొని గేదె మృతి గురించి పరిశీలించారు. స్థానిక పోలీస్ సిబ్బంది కేసు నమోదు చేసి మరణానికి గల కారణాలను దర్యాప్తు చేస్తామని రైతుకు తెలిపినారు. ఒక్కసారిగా 1,20,000 రూపాయలు గల గేది మృతి చెందడంతో రైతు కొరివి మాదారి కుటుంబాల్లో విషాదఛాయలు అల్లుకున్నాయి. రైతు స్థానిక విద్యుత్ మరియు పోలీస్ సిబ్బందితో మాట్లాడుతూ తనది నిరుపేద కుటుంబమని ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకున్నాడు.





