ప్రాంతీయం

ఘనంగా టీపీటీఎఫ్ ఆవిర్భావ వేడుకలు

101 Views

టీపీటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గజ్వేల్ జోన్ కార్యాలయంలో టీపీటీఎఫ్ జెండాను జోన్ కన్వీనర్ సుంచు నరేందర్ ఎగురవేశారు. ఈ సందర్భంగా సుంచు నరేందర్ మాట్లాడుతూ టీపీటీఎఫ్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుందన్నారు. 317 జివో ద్వార స్థానికతను కోల్పోయిన ఉపాధ్యాయుల పక్షాన, వేరు వేరు జిల్లాలకు ఆలాట్ కాబడిన ఉపాధ్యాయ దంపతుల సమస్యల పై అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఉపాధ్యాయుల పదోన్నతులు – బదిలీలు షెడ్యూలు విడుదల చేసి ఉపాధ్యాయుల పదోన్నతులు – బదిలీలు వెంటనే నిర్వహించాలని అన్నారు. ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరగడం వలన, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతన సవరణ చేయాలని, పాఠశాలలు తెరిచే నాటికి అనగా జూన్ 12 వరకు పాఠశాలల్లో స్కావెంజర్ లను నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాంచంద్రం, రాజులు, ఎల్లయ్య, దూలం నర్సింలు గౌడ్, మల్లయ్య, నాగ భూషణం గజీటెడ్ ప్రధానోపాధ్యాయులు కనక రాజు, రవీందర్, కో కన్వీనర్ విద్యాసాగర్, వర్గల్, జగదేవపూర్ గజ్వేల్, మార్కుక్, ములుగు, రాయపోల్, దౌల్తాబాద్ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పర్వతం నర్సయ్య, నేతి శంకర్, తాళ్ల నాగరాజు, సత్తయ్య, రాములు, ఓటరికారి శ్రీనివాస్, కటుకం రాజయ్య, జాలిగామ యాదయ్య, ఉపాధ్యాయులు పెంటయ్య, షరీఫ్, ఆంజనేయులు, సురేష్, మీనయ్య, కృష్ణ, లక్ష్మయ్య, సంతోష్, పోచం, తులసీదాస్, నర్సింలు, నాగ స్వామి, ఇబ్రహీం, తుమ్మ సత్యం, భాస్కర్, రాజానర్సింహా, మెట్టయ్య, హరిబాబు, సంతోష్, రాజకుమార్, చార్లెస్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Manne Ganesh Dubbaka