మంచిర్యాల పోలీస్ స్టేషన్ తనిఖీకి చేసిన డిసిపి మంచిర్యాల్ .
మంచిర్యాల జోన్ పరిధి మంచిర్యాల పోలీస్ స్టేషన్ ను శ్రీ ఎగ్గడి భాస్కర్ ఐ. పి.యస్., డి.సి.పి. మంచిర్యాల. సాధారణ తనిఖీలలో భాగంగా తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ సిసిసి పిటిషన్ ల వాటి రికార్డ్ లను తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరు, నమోదు చేయబడిన కేసులలో ప్లాన్ ఆఫ్ యాక్షన్, ప్రజలతో, ఫిర్యాదుదారులతో ఎలా ప్రవర్తిస్తున్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల పిర్యాదుల విషయం లో వెంటనే స్పందించి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలి. మహిళలు, పిల్లలు, సీనియర్ సిటిజెన్ లతో మర్యాదగా మాట్లాడాలి ప్రవర్తించాలి అని అధికారులతో మరియు సిబ్బంది తో విధుల గురించి చర్చించి అవగాహన కల్పించారు.
డి.సి.పి., ప్రజలను ఉద్దేశించి మాట్లాడుచూ ఎవరైనా ఒకటి కంటే ఎక్కువ కేసులలో పాల్గొని ఉన్నట్లయితే వారిపై రౌడీ షీట్ తెరిచి వారి పై ప్రత్యేక నిఘా ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా వ్యభిచారం చేసినట్లు సమాచారం వచ్చినచో అట్టి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకొని సంబంధిత స్థలాలను జప్తు చేసి కోర్టుకు నివేదించడం జరుగుతుంది. అని తెలిపినారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు ప్రజల దృష్టికి వచ్చినట్లైతే పోలీస్ వారికి సమాచారం అందించాలని వారి పేర్లు గోప్య ముగా ఉంచబడుతాయని తెలిపారు.
