సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదిపుర్ గ్రామంలో ఆరాధ్యదైవమైన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జమదగ్నిల కళ్యాణ మహోత్సవం, గౌడ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న సందర్భంగా ఆదివారం స్థాపిత దేవత గణపతి పూజ. నవగ్రహ పూజ అగ్ని ప్రతిష్ట తీర్థ ప్రసాద వితరన పూజలు నిర్వహించారు. అనంతరం. హోమం జరిపించి, సాయంత్రం పోచమ్మ గ్రామ దేవతలకు ప్రతీ ఇంటినుంచి మహిళలు బోనం తీసి, డప్పుచప్పుళ్ల మధ్య అమ్మవారి ఆలయానికి తరలివెళ్లారు. శివసత్తుల పూనకాలు, మహిళలు బోనం ఎత్తుకుని సంతోషంగా బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ రేణుకా ఎల్లమ్మ తల్లి అనుగ్రహంతో అందరూ బాగుండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
