గుట్కా తయారీ, విక్రయాలు నిషేధించడం అభినందనీయం అని రాష్ట్ర యువజన సంఘాల ప్రధాన కార్యదర్శి, సిద్దిపేట జిల్లా బాలల సంక్షేమ సమితి సభ్యులు రాష్ట్రపతి అవార్డు గ్రహీత, దేశబోయిని నర్సింలు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఆదివారం దేశబోయిన నర్సింలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గుట్కా తయారి, విక్రయాలను పూర్తిగా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ఈ నిర్ణయం 24 మే 2024 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొనడం అభినందనీయం అని ఇప్పటికే డ్రగ్స్ సప్లై చేస్తున్న వారిపై, విక్రయిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనావుందని రాష్ట్రంలో యువత మాదక ద్రవ్యాలు, గంజాయి, డ్రగ్స్ వంటి వారికి అలవాటు పడి జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారని యువతపై అలాంటి ప్రభావం పడకూడదనే ఈ కీలక నిర్ణయం పకడ్బందీగా అమలుపార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తీసితెలియక వీటి బారిన పడిన వారిని రియాడిక్షన్ కౌన్సిల్లింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి అవగాహణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
