తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఇంద్ర నగర్ లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పోచమ్మ బోనాలు పండుగను ఘనంగా నిర్వహించారు మహిళలు ఉపవాసం ఉండి ఇంటింటి బోనాలు తీసి డప్పు చప్పులతో ఆటపాటలతో పోచమ్మ తల్లికి నైవేద్యంగా బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు బాగుండాలని ప్రజలు సుఖ బిక్షంగా ఉండాలని పోచమ్మ తల్లిని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కోడి అంతయ్య ఉపసర్పంచ్ పెద్దూరి తిరుపతి, వార్డు సభ్యులు రెడ్డి పరశురాములు,పద్మశాలి సంఘం అధ్యక్షులు శంకర్, బాలకిషన్, శ్రీనివాస్ , సత్కూరి నరసయ్య,పద్మశాలి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
