ప్రాంతీయం

అనాజీపూర్ గ్రామంలో తిరుగుతూ గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే – బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ.

129 Views
  1.  రాయపోల్ మండలంలొని అనాజిపూర్ గ్రామంలో ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు అనాజీపూర్ గ్రామంలో వీధుల తిరుగుతూ గ్రామ ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామపంచాయతీ బిల్డింగ్ వద్ద ప్రజలతో ముఖాముఖి మాట్లాడుతూ ఆర్ ఐ భాను ప్రకాష్ గ్రామపంచాయతీ సెక్రటరీ శ్రీమాన్ ను అర్హులై ఉండి పెండింగ్ లో ఉన్న పెన్షన్ల సమస్యను పరిష్కరించాలని ఆర్ ఐ భాను ప్రకాష్ భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని వీటిని త్వరలో పరిష్కరించాలని సూచించారు అదేవిధంగా అనాజిపూర్ నుండి రాయపోల్ వరకు రోడ్లు వారం రోజుల్లో పనులు జరగాలని అన్నారు అనంతరం రాయపోల్ మండల కేంద్రంతో పాటు అనాజీ పూర్ గ్రామాలలో వివిధ కారణాలతో ఇటీవల మృతి చెందిన చిన్నోల్ల నరసయ్య, బిజెపి నాయకులు గజ్వేల్ మల్లేశం తల్లి సత్యమ్మ అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందింది. వారి కుటుంబాన్ని, బిజెపి నాయకులు ముత్యాలు గౌడ్ పెద్దమ్మ వారి కుటుంబాన్ని అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న బిజెపి నాయకులు రాచకొండ యాదగిరి ని,అలాగే మండల కేంద్రం రాయపోల్ కు చెందిన బిజెపి నాయకులు రాజ గౌడు పెద్దమ్మ మూడు రోజుల క్రితం మృతిచెందగా వారి కుటుంబాన్ని. అలాగే ఎంపీటీసీ బ్యాగరి యాదమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంది ఆమెను మెరుగైన వైద్యం కోసం హాస్పిటల్కు తీసుకువెళ్లి చికిత్స చేయించాలని వారి కుటుంబ సభ్యులకు తెలిపారు అలాగే బిజెపి నాయకులు జిల్లా రాజు తల్లిని గురువారం దుబ్బాక ఎమ్మెల్యే మాదవనేని రఘునందన్ రావు పరామర్శించారు. వారి వెంట మండల పార్టీ అధ్యక్షుడు మాదాసు వెంకట గౌడ్, బీజేవైఎం మండల అధ్యక్షులు దయాకర్ రెడ్డి ,బిజెపి మండల సీనియర్ నాయకులు సంతోష్ రెడ్డి, బిజెపి ఓ బి సి రాష్ట్ర నాయకులు రాజ గౌడ్, నీల స్వామి, గజ్వేల్ రామచంద్రo, హరికృష్ణ గౌడ్, దయాకర్ రెడ్డి,తిరుపతి రెడ్డి, నరేష్ గౌడ్, బాల్ రాజ్, వెంకట్ గౌడ్, కృష్ణ, రాంపల్లి సతీష్ తదితరులు ఉన్నారు.
IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7