ప్రాంతీయం

మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

57 Views

మంచిర్యాల నియోజకవర్గం.

మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే.

మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల కార్పోరేషన్ కమిషనర్ శివాజీ.

మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని పలు వార్డుల్లో

9వ వార్డు (రంగంపేట) లో 1.57 కోట్ల రూపాయలతో డ్రైన్స్ మరియు రోడ్డుల నిర్మాణానికి శంకుస్థాపన.

17వ వార్డు బృందావన కాలనీలో 65 లక్షల రూపాయలతో డ్రైన్స్ మరియు రోడ్డుల నిర్మాణానికి శంకుస్థాపన.

4వ వార్డు రాజరాజేశ్వర కాలనీలో 2.91 కోట్ల రూపాయలతో డ్రైన్స్ మరియు రోడ్డుల నిర్మాణానికి శంకుస్థాపన.

3వ వార్డు (సూర్య నగర్ రోడ్ నెంబర్ 17) లో 2.70 కోట్ల రూపాయలతో డ్రైన్స్ మరియు రోడ్డుల నిర్మాణానికి శంకుస్థాపన.

హమాలివాడ హనుమాన్ టెంపుల్ నుండి తిలక్ నగర్ వరకు ఇరుపక్కల 2 కోట్ల రూపాయలతో డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన.

1వ వార్డు (రాజీవ్ నగర్) లో 3.37 కోట్ల రూపాయలతో డ్రైన్స్ మరియు రోడ్డుల నిర్మాణానికి శంకుస్థాపన.

హనుమాన్ టెంపుల్ దొరగారి పల్లె లో 2 కోట్ల రూపాయలతో డ్రైన్స్ మరియు రోడ్డుల నిర్మాణానికి శంకుస్థాపన.

ఈసందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండడమే నా లక్ష్యమని అన్నారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found