నేడు జగదాంబ ఆలయంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం.
బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ జగదాంబ ఆలయ మూడవ వార్షికోత్సవం.
ఉదయం తాండవాసులు పిల్ల పాపలతో కటుంబ సమేతంగా తరలివచ్చి ఎంతగానో ఆనందోత్సవాల తో ఆలయ వద్ద హోమ యజ్ఞ కార్యక్రమాలు నిర్వహించారు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ గ్రామంలో బంజారా తాండాలో గల సంత్ సేవాలాల్ జగదాంబ ఆలయ మూడవవార్షికోత్సవం సందర్భంగా తాండ వాసులు అందరూ కలిసి హోమ యజ్ఞ కార్యక్రమాలు నిర్వహించారు. నేడు సోమవారం రోజున ఉదయం ఆలయం వద్ద భోగ్ బండార్ కార్యక్రమం ఉంటుందని తాండవాసులు తెల్పారు. ఇట్టి కార్యక్రమానికి ఏర్గట్ల మండలం తో పాటు గా జిల్లా లోని ఇతరత్రా మండల గ్రామాల ప్రజలు భక్తులు ప్రతి ఒక్కరూ అత్యంత సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.తదనంతరం అన్నదానం కార్యక్రమం ఉంటుందని అన్నారు.
ఇట్టి కార్యక్రమంలో సంఘం సభ్యులు బాదావత్ శివ నాయక్, భూక్య శివ నాయక్, మూఢవత్ దేవేందర్ నాయక్, భూక్య మోహన్ బుడ్డి నాయక్, మరియు తాండవాసుల ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
