అక్రమంగా తయారు చేస్తున్న 15 లీటర్ల గుడుంబా పట్టుకున్న రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు.
రామగుండం కమీషనరేట్ పెద్దపల్లి జోన్ ధర్మారం పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మారెడ్డిపల్లి లో గుడుంబా అక్రమంగా తయారుచేసి అమ్ముతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, తన సిబ్బంది తో తనిఖీ చేయగా అక్కడ సుమారు 15 లీటర్లు గుడుంబా గుర్తించడం జరిగింది. గుడుంబా అమ్ముతున్న వ్యక్తి ని విచారించగా తనపేరు అజ్మీరా రాజేశం S/o జగన్ నాయక్ 40 yrs R/o. కొత్తపల్లి h /o బొమ్మారెడ్డిపల్లి ధర్మారం ఏరియా అని తెలిపినాడు. స్వాధీన పరుచుకున్న గుడుంబాలు మరియు నిందితుడిని తదుపరి విచారణ నిమిత్తం ధర్మారం పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగింది.





