ప్రాంతీయం

వాటర్ ప్లాంట్ ను ఓపెన్ చేయండి

98 Views

సింగరేణి వారు నిర్మించిన వాటర్ ప్లాంట్ ఓపెన్ చేయండి

ముదిగుంట గ్రామస్తులు

మంచిర్యాల 20 మే 2024
తెలుగు న్యూస్

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట గ్రామంలో జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ వారి ఆధ్వర్యంలో సుమారు 8 నుంచి 10 లక్షల నిధులతో 2017 సంవత్సరంలో మంజూరై నిర్మాణం పూర్తి చేసుకున్న 1000 లీటర్ల సామర్థ్యం కలిగినటువంటి శుద్ధ జల వాటర్ ప్లాంట్ ఇప్పటివరకు ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. గ్రామాలలో సరైన మంచినీటి సదుపాయాలు లేక కలుషిత నీరును తాగుతూ ప్రజలు పడే బాధలు అంతా ఇంతా కాదు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతో కూడబెట్టుకున్న ఒక్కొక్క రూపాయి ఆస్పత్రుల్లో పాలు చేస్తూ ఏపూట కా పూట గడుపుతున్న జనాల అగచాట్లను గమనించి ఎటు చూసినా కాలుష్యంతో నిండిపోయిన ఈ వాతావరణం లో మనిషి మనుగడకు అతి ముఖ్యమైనటువంటి నీటిని శుద్ధి చేసి అందించేందుకు రివర్స్ అస్మోసిస్ ప్రక్రియ ద్వారా నీటి నుండి మలినాలను, ఖనిజాలను, వ్యర్ధాలను వేరుచేసి స్వచ్ఛమైన మంచి నీటిని ప్రజలకు అందించే ఉద్దేశంతో సింగరేణి సంస్థ ఈ ప్లాంట్ ని నిర్మించడం జరిగింది. అటువంటి ఆర్వో ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసుకొని ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు ఉపయోగంలోకి రాకపోవడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఈ నిర్లక్ష్యానికి ముగింపు పలుకుతూ ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకొని ఈ శుద్ధ జల నీటి ప్లాంట్ ని ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి గ్రామస్తులు కోరుకుంటున్నారు.

No Slide Found In Slider.

Poll not found