ముస్తాబాద్, మే 13 (24/7న్యూస్ ప్రతినిధి): కరీంనగర్ పార్లమెంట్ కో కన్వీనర్ కనమేనిచక్రధర్ రెడ్డి ముస్తాబాద్ లో తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. సుపరిపాలన దిశగా కొనసాగింపునకు ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. పోలింగ్ ఏర్పాట్లు బాగున్నాయి. ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ ప్రజల తమ ఆకాంక్షలకు అనుగుణంగా ఓటువేసే వాతావరణం కల్పించిన అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు.
