ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే10, మండలంలోని బంధనకల్ గ్రామంలో ఇటీవల కురిసిన అకాలవర్షాలకు వరిధాన్యం వరద ప్రవాహం దాటికి కొట్టుకపోవడంవలన టిడిఎఫ్ జైకిసాన్ వారు స్పందించి బదనకల్ గ్రామంలోని సొసైటీ రైతులకు అకాల వర్షాలవల్ల మరిధాన్యం నష్టపోకుండా ఉండాలని ఎంతో కొంత బాధ్యతగా భావించి తమవంతు సహాయంగా వారికి టార్పలిన్ కవర్లు రైతులందరికీ ఇవ్వలేని పరిస్థితులు ఉన్నందున సొసైటీ తరపున అందించారు. ఈకార్యక్రమంలో టడిఎఫ్ జనరల్ సెక్రెటరీ రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఏంసి డైరెక్టర్ చిగురు నరేష్, ఫాక్స్ డైరెక్టర్ మాధవరావు, రైతులు భూపాల్ వెంకట్రావ్, రాజు, మహిళా రైతులు పాల్గొన్నారు.
