ముస్తాబాద్ డిసెంబర్ 27, సెస్ఎన్నికల్లో అధికార పార్టీ బిఆర్ఎస్ అభ్యర్థి గెలిచిన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ నుండి ప్రధాన రహదారి వెంబడి టపాకాయలు పేల్చి భారీ డీజే మేలాలతొ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు కలిసి సందుపట్ల అంజిరెడ్డికి శాల్వాతో సన్మానం చేసి పూలమాల వేసి ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తెలంగాణ తల్లికి పూలమాల సమర్పించి ర్యాలీ కొనసాగించారు. ఈకార్యక్రమంలో మండల రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, మండల అధ్యక్షుడు బొంపల్లి సురేందర్ రావు, జెడ్పిటిసి గుండం నరసయ్య, ఏఎంసి చైర్మన్ శీలం జానాభాయ్, సర్పంచ్ గాండ్ల సుమతి, దెబ్బడ రేణుక, మహిళలు పెద్ద మొత్తంలో మండలంలోని పలు గ్రామాల బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చి రంగుల హోలీ జాతరలా విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు.
