సిద్దిపేట జిల్లా కేంద్రంలో త్వరలో నిర్వహించే శ్రీ కృష్ణ కాలచక్రం అయిత అయిత చండీ అతి రుద్రం 78వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం ఏర్పాట్లు గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కాచారం రేణుకా ఎల్లమ్మ దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షుడు అధ్యాత్మిక ధార్మిక జాతీయ అధ్యక్షులు వంగపల్లి అంజయ్య స్వామి పర్యవేక్షించి, శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి వారితో యాగ పనుల గురించి చర్చించారు. సిద్దిపేట పట్టణ కేంద్రంలో వేములవాడ కమాన్ ఎదురుగా విశాలవంతమైన ప్రాంతంలో అత్యంత వైభవంగా తేదీ 19 – 11- 2022 శనివారం నుండి 02 – 12 – 2022 శుక్రవారం వరకు అయిత చండీయాగం అతిరుద్రం, శ్రీ సీతారాముల పట్టాభిషేకం, విశ్వశాంతి మహాయాగం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వంగపల్లి అంజయ్య స్వామి మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం విశ్వశాంతి మహాయాగం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని దైవ కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు నేతి కైలాసం,జిల్లా శ్రీనివాస్, ఉప్పల రమేష్ , గందే ఎల్లేశం తదితరులు పాల్గొన్నారు.