తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ రాణే పరిశ్రమ వద్ద మహాసభల వాల్పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది .ఈ సందర్భంగా సిఐటియు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు జే .మల్లికార్జున్ గారు మాట్లాడుతూ నిరంతరం కార్మిక సమస్యలపై పోరాటం చేస్తున్న సిఐటియు మొట్టమొదటిసారిగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో నాలుగవ మహాసభలు జరుపుతున్న సందర్భంగా కార్మిక లోకం ఈ మహాసభలను జయప్రదం చేయాలని అన్నారు. డిసెంబర్ 21, 22 ,23 తేదీలలో నిర్వహించే రాష్ట్ర మహాసభలకు రాష్ట్రం నలుమూలల నుండి సిఐటియు నాయకత్వం హాజరవుతున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పటికే దేశంలో మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను కాలరాస్తుందని వాపోయారు. కార్మిక హక్కులను కాపాడే దిశగా ఈ మహాసభలలో చర్చలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేశారు .ఈ మహాసభలను కార్మికుల లోకం జయప్రదం చేయాలని మరోసారి గుర్తు చేశారు .ఈ కార్యక్రమంలో సిఐటియు సిద్దిపేట జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సందబోయిన ఎల్లయ్య, కాముని గోపాలస్వామి, జిల్లా సహాయ కార్యదర్శి బండ్ల స్వామి, జిల్లా కమిటీ సభ్యులు సందిటి రంగారెడ్డి, రాణే పరిశ్రమ యూనియన్ జనరల్ సెక్రెటరీ వేణుగోపాల్ ,వర్కింగ్ ప్రెసిడెంట్ బిక్షపతి, యూనియన్ నాయకులు నర్సింలు, శివయ్య, చంద్రశేఖర్ రెడ్డి, రవికుమార్ ,కుతుబుద్దీన్, మల్లయ్య,కృష్ణ పాల్గొన్నారు.
