నవంబర్/16; మండల అభివృద్ధి కార్యాలయం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎంపీపీ జనగామ శరత్ రావు అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశము ఏర్పాటు చేశారు, ఈసమావేశంలో ఎంపీపీ అన్ని శాఖలు మరియు అంశాల వారీగా అధికారులతో ప్రజా ప్రతినిధులను సమన్వయం చేస్తూ గ్రామస్థాయిలో సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా విధులను డిసెంబర్ లోగా నిర్వహించాలని సూచించారు, సర్పంచులు, ఎంపిటిసిలు, వివిధ హోదాలు కలిగిన అధికారులు కొన్ని గ్రామాలలో సమస్యలు పరిష్కార దిశకు వెళ్తుండగా అక్కడక్కడ కొన్ని సమస్యల కారణంగా మిగిలి ఉన్నాయని సమావేశంలో తెలిపారు. మండల సర్వసభ్య సమావేశంలో దిగ్విజయంగా పల్లెల్లో నిర్వహించి పారిశుద్ధ్య కార్యక్రమాన్ని మిషన్ భగీరథ, విద్యుత్ సమస్యలతో పాటు పలు సమస్యలు చేపట్టిన పనులు సమస్త సర్పంచ్ లకు ఎంపిటిసి లకు కార్యదర్శులకు గ్రామాల్లో ఉన్న సమస్యలను అధికారులు ప్రజాప్రతినిధుల సహకారంతో పరిష్కరించి ముందుకెళ్లాలని ఎంపీపీ సమావేశంలో తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జడ్పిటిసి గుండం నరసయ్య, ఏఎంసీ చైర్మన్ శీలం జనాభాయ్, ఎంపీడివో రమాదేవితో పాటు మండలం లోని సమస్త గ్రామ సర్పంచులు, ఎంపిటిసిలు, వివిధ హోదాలుగల అధికారులు పాల్గొన్నారు.
