సిద్దిపేట జిల్లా నవంబర్ 17
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
మర్కూక్ మండల కేంద్రానికి చెందిన గుంటి రేణుక కొన్ని రోజుల క్రితం పాము కాటుకు గురై చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న మర్కూక్ మండల పార్టీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధితురాలి పిల్లల పేరుమీద ఫిక్సడ్ డిపాజిట్ చేయటానికి వారి కుటుంబానికి రూ.100000, లక్ష రూపాయల, ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, మాధవరెడ్డి, సుధాకర్ రెడ్డి, సాయిని మహేష్,మోర్సు శ్రీనివాస్ రెడ్డి,పాపోల్ల రాజు, బుల్లె మల్లేష్,ఐలయ్య, మల్లేష్,అశోక్ తదితరులు పాల్గొన్నారు.





