సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో అంగడి పెట్ హనుమాన్ దేవాలయం వద్ద గురువారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అంబలి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ,వాసవి క్లబ్ అద్యక్షుడు జగ్గయ్య గారి శేఖర్, కొండ పోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ గోలి సంతోష్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నామని అందులో భాగంగా వాసవి క్లబ్ సభ్యుడు నితీష్ జన్మదినం సందర్భంగా అంబలి పంపిణీ చేయడం జరిగిందని అంబలి ఆరోగ్యానికి చాలా మంచిది అని ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిరాణా అసోసియేషన్ అధ్యక్షులు సిద్ది బిక్షపతి,పడకండి రవి,అత్తెల్లి లక్ష్మయ్య, కైలాస ప్రభాకర్, లయన్ నేతి శ్రీనివాస్, లయన్ గుడాల రాధాకృష్ణ, రవీందర్, కైలాస ప్రశాంత్, ఉమేష్, సిరిపురం సత్యనారాయణ, తెరల రాజులు, బుస్సా శ్రీనివాస్ రాణి, బుస్సా నితీష్, చంద్ర శేఖర్ బెజగమా రాము, దూబకుంట లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
