ముస్తాబాద్, ఏప్రిల్ 27 (24/7న్యూస్ ప్రతినిధి): బీజేపీ మండల అధ్యక్షులు మేరుగు అంజగౌడ్ ఆధ్వర్యంలో శక్తికేంద్ర ఇంచార్జ్ లు, బూత్ అధ్యక్షులు, సీనియర్ నాయకులతో రాబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి హిందు టైగర్ బండిసంజయ్ కుమార్ విజయంపథంకోసం సన్నాహక సమావేశం నిర్వహించామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేపటి నుండి బూతులెవల్లో ప్రతి గ్రామంలో ప్రతి గడప గడపకు తిరిగి గత పదేళ్లలో బీజేపీ చేసిన అనేకమైన సంక్షేమ పథకాలను అమలు చేసినటువంటి ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బాధ నరేష్, జిల్లాఅధికార ప్రతినిధి సంతోష్ రెడ్డి, జిల్లా కార్యదర్శి, మీస సంజీవ్, బిజెపి సీనియర్ నాయకులు శ్రీనివాసరావు, ప్యాక్స్ డైరెక్టర్ ఎల్లగిరి, శక్తి కేంద్ర ఇంఛార్జీలు వెంకటేష్, మహేందర్, రమెష్ రెడ్డి, జిల్లెళ్ళ మల్లేష్, కొలకృష్ణ, కాసోడి రమేష్, మీసాశంకర్, బాల్ రెడ్డి. కళ్యాణ్, చికోటి మహేష్, ఉరడి రాజులు తదితరులు పాల్గొన్నారు.
