– సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
దౌల్తాబాద్: వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరిస్తూ వివిధ శాఖల్లో నియమించడం హర్షణీయమని వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు నీరుడి యాదగిరి అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ తహాసిల్దార్ కార్యాలయం ముందు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సేవలను గుర్తించి తమను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించి వివిధ శాఖల్లో పోస్టింగ్ లు ఇవ్వడమే కాకుండా పే స్కేల్ ను వర్తింపజేయడంపై సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. తమను గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించిన సీఎం కేసీఆర్ కు వీఆర్ఏల కుటుంబాలు రుణపడి ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు శ్రీనివాస్, మమత, భాగ్యశ్రీ, కనకరాజు, నగేష్, బాలమణి, రజిత తదితరులు పాల్గొన్నారు….




