మే 2, 24/7 తెలుగు న్యూస్:విద్యార్థుల చదువులు సమసమాజ అభివృద్ధి కోసం దోహదపడాలి.
రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఎం.డి జబ్బార్.
ఉన్నత విద్యార్థుల ఆలోచన విధానం ఉన్నతంగా ఉండాలని,తమ చదువులు సమసమాజ అభివృద్ధి కోసం దోహదపడాలని “రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఎం.డి జబ్బార్, జేవివి రాష్ట్ర నాయకులు జితేందర్ అన్నారు.
వనపర్తి జిల్లా కేంద్రంలోని విజ్ఞాన్ జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ జిల్లా విద్యా,వైజ్ఞానిక శిక్షణ తలగతుల సందర్భంగా విజ్ఞాన్ జూనియర్ కళాశాల విద్యార్థులు స్టేట్ ర్యాంకులు సాధించిన గాయత్రి,కళ్యాణీలను శాలువా,పూల బుకేలతో సన్మానించి అభినందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి ఎం.ఆది జిల్లా ఉపాధ్యక్షులు మల్లేష్,జిల్లా కమిటీ సభ్యులు వీరన్న నాయక్, జిల్లా కో కన్వీనర్ మహేష్,మహిళా సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సాయి లీల, ఎస్ ఎఫ్ ఐ నాయకులు సాయి, భరత్ తదితరులు పాల్గొన్నారు.




