Breaking News

నిరుపేద కుటుంబానికి మేమున్నామని అండగా భరోసా స్వచ్ఛంద సంస్థ

312 Views

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో ఉన్న ఇటీవల అప్పుల బాధతో మరణించిన చిగురు స్వామి విషయం తెలుసుకున్న భరోసా స్వచ్ఛంద సంస్థ అక్కడికి వెళ్ళింది భరోసా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 50 కేజీల బియ్యం రెండు నెలలకు సరిపోయే కిరాణా సామాగ్రి మరియు 20000రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పారు . కుటుంబ పోషణ, ఖర్చులకు డబ్బులు లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

సహాయం చేయాలని భరోసా స్వచ్ఛంద సంస్థను కోరడంతో భరోసా స్వచ్ఛంద సంస్థ ఇంటికి వెళ్ళి వారి వివరాలను అడిగి తెలుసుకుని 20000రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ . వారి కుటుంబానికి ఎప్పుడు అండదండలుగా ఉంటామని వారు చెప్పారు భరోసా స్వచ్ఛంద సంస్థ సభ్యులు రాజు. ప్రేమ్ సాగర్. నరేష్ శివ అంజి గణేష భరోసా స్వచ్ఛంద సంస ఆధ్వర్యంలో సమాజం పట్ల బాధ్యతగా ఆపదలో ఉన్నవారికి తమవంతు సహాయాన్ని అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో. వర్కటం వెంకటేష్. గణేష్ నాగరాజు నగేష్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Pitla Swamy