గాజులరామారం హెచ్.ఏ.ఎల్. కాలనీ లోని సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద రూ. 10 లక్షల వ్యయంతో నిర్మాణకమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కెపి వివేకానంద్..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 125డివిజన్ గాజులరామారం పరిధిలోని హెచ్.ఏ.ఎల్. కాలనీలోని సత్యనారాయణ స్వామి దేవాలయం నందు రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్నకమ్యూనిటీ హాల్ నిర్మాణ పనుల భూమి పూజ కార్యక్రమంలో ఈ రోజు ఎమ్మెల్యే కె.పి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి కాలనీ అభివృద్ధే తమ ధ్యేయం అని అన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి కాలనీలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు.
