ముస్తాబాద్ ఏప్రిల్ 27 (24/7న్యూస్ ప్రతినిధి) అంతిమ సంస్కారాలు కూడా అత్యంత గౌరవంగా సాగాలని వైకుంఠధామాల వరకు వైకుంఠ రథం ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. ఎప్పుడు మండలంలో రథానికి ఏదో లోపాలు దరిచేరి సమయానికి అందగా ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. కాగా ముస్తాబాద్ మండలానికి పక్క మండలం ఎల్లారెడ్డిపేట నుండి అంతిమ సంస్కారాలకు వైకుంఠ రథం తెప్పించడం మండల ప్రజలు సిగ్గుచేటు అంటున్నారు. ప్రతి గ్రామానికి ఒక వైకుంఠధామం ఏర్పాటు అయింది. అన్ని రకాల సదుపాయాలతో వాటిని ఏర్పాటు చేశామన్నారు. అది కూడా మోడల్ వైకుంఠధామాలను నిర్మించాం చెప్పుకోవడమే గొప్పలు అంటూ ప్రజలు వైకుంఠ రథాన్ని వినియోగించుకునే విధంగా అందుబాటులో ఉంచాలని పలు సంఘాల నాయకులు ప్రజలు ముక్కు మీద వేలేసుకుని ఆశ్చర్యపోయారు. ఇకనైనా మండల ప్రజా ప్రతినిధులు అధికారులు చొరవ తీసుకుని వైకుంఠ రథాన్ని అందుబాటులో ఉంచాలని కోరారు.
