(కరీంనగర్ జిల్లా సెప్టెంబర్ 14)
మానకొండూర్ మాజీ శాసనసభ్యుడు ఆరెపల్లి మోహన్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.కరీంనగర్ లో సన్నిహితులు, ముఖ్య అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించి గురువారం కరీంనగర్ లోని ప్రెస్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించి బీఆర్ఎస్ పార్టీకి తన రాజీనామా ప్రకటించారు.
2019 పార్లమెంట్ ఎన్నికలు ముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిన ఆరెపల్లి మోహన్ కు ఆ పార్టీలో ప్రాధాన్యం దక్కకపోవడంతో రాజీనామాకు సిద్ధమయ్యారు. మానకొండూర్ లో బీఆర్ఎస్ టికెట్ కోసం ఆయన ఎదురుచూశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కే కేసీఆర్ మళ్లీ అవకాశం
కట్టబెట్టడంతో, వారం రోజుల క్రితమే రాజీనామా చేస్తానని ప్రకటించడంతో, రంగంలోకి దిగిన మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆరెపల్లి మోహన్ తో ఫోన్ లో మాట్లాడి ఎమ్మెల్సీ ఇప్పిస్తానని బుజ్జగించడంతో రాజీనామా చేసే ఆలోచన వెనక్కి తీసుకున్నాడు. ఇప్పటివరకు కేసీఆర్ నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో మరొకసారి అనుచరులతో సమావేశమై కొద్దిసేపటి క్రితం కరీంనగర్ ప్రెస్ భవన్ లో రాజీనామా చేశాడు. తన రాజీనామా పత్రాన్ని సీఎం కేసీఆర్ కు పంపిస్తానని ఆయన తెలిపారు..