రాజకీయం

పేద కుటుంబాలకు పెద్దన్న.. పుస్తె మట్టలు వితరణ చేసిన ఎంపీపీ…

205 Views

ముస్తాబాద్, ఏప్రిల్ 22 (24/7న్యూస్ ప్రతినిధి): ఎంపీపీ జనగామ శరత్ రావు నిరుపేద యువతుల పెళ్లిళ్లకు పుస్తే మట్టెల వితరణ చేసి పలువురికి ఏళ్ల తరబడి ఆదర్శంగా ప్రాయంగా నిలుస్తున్నారు. గ్రామాల్లో ఎవరైనాసరే పేదింటి ఆడపిల్లలకు వివాహ సమయంలో  పుస్తేమెట్టెలు అందజేసి వారికి పెద్దన్నయ్యల అండగా ఉంటున్నారు ఈ క్రమంలో ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో నాగేల్లి చంద్రవ్వ సుధాకర్ దంపతుల కూతురు భవాని, నామపూర్ గ్రామానికి చెందిన యారపు లక్ష్మీ బుదయ్య దంపతుల ద్వితీయ పుత్రిక స్వాతిలకు  పుస్తె మట్టెలు వివాహాలకు ఎంపీపీ జనగామ శరత్ రావు పంపియడంతో, ఈ పుస్తె మట్టెలను వధువు తల్లిదండ్రులకు గ్రామశాఖ అధ్యక్షులు నిమ్మదేవి రెడ్డి, తాడెపు అనిల్, న్యాలం బాలాగౌడ్, కొత్తపల్లి నారాయణ బీ ఆర్ ఎస్వీ ఉపాధ్యక్షులు బండి ఆదర్శ పటేల్, సోషల్ మీడియా నరేంద్ర చారి, అందచేసారు. ఇప్పటి వరకు నిరుపేద యువతుల పెళ్లిళ్లకు పుస్తే మట్టెల గతపది సంవత్సరాలుగా అంద చేస్తూ ముందు వరుసలో ఉన్నారని పలువురు తెలిపారు. ఆ భగవంతుని దయతో నిరుపేద యువతుల పెళ్లిలకు పుస్తె మట్టెల పంపిణీ ఇంకా కొనసాగిస్తామని అని వెల్లడించారని ఎంపీపీ పేర్కొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్