సూపర్ స్టార్ మహేష్ బాబును కలిసిన సన్ రైజర్స్ హైదరాబాద్ టిము.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లతోఈరోజు సమావేశమయ్యారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్‌తో పాటు మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మలను కలిశారు.
కాగా, దీనిపై ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా సోషల్ మీడియాలో స్పందించారు. మహేష్ బాబును టాలీవుడ్ ప్రిన్స్ అని అభివర్ణించారు.
ఆయనను కలవడం ఎంతో ఆనందంగా అనిపించింది అని పేర్కొన్నాడు.
ఈ సీజన్‌లో ప్యాట్ కమిన్స్ సారథ్యంలో హైదరాబాద్ జట్టు అద్భుత ప్రదర్శన చేస్తొంది. ఆడిన 7 మ్యాచ్ లలో 5 గెలిచి ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో 3వ స్థానంలో నిలిచింది.
